యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్మించిన అతిపెద్ద హిందూ భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ఆలయం ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.! సుమారు రూ.700 కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయం దిగువ భాగంలో పవిత్ర గంగా, యమునా నదీ ప్రవాహాన్ని మరిపించేలా కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమాసియాలోనే ఇది అతి పెద్ద ఆలయం. 32.92 మీటర్లు (108 అడుగులు) ఎత్తు, 79.86 మీటర్లు (262 అడుగులు) పొడవు, 54.86 మీటర్లు (180 అడుగులు) వెడల్పుతో ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు.