రాజస్థాన్ పోలీసులు ఒక నిందితుడిని పట్టుకుంటే ప్రకటించిన బహుమతి ఎంతో తెలుసా అక్షరాలా ‘50పైసలు’. సింఘనా పోలీస్‌స్టేషన్‌లో ఆయుధాల చట్టం కింద కేసు నమోదై తప్పించుకు తిరుగుతున్న యోగేశ్‌ను పట్టుకుంటే 50పైసలు రివార్డుగా ఇస్తామంటూ ప్రకటించారు.
‘ఒక నేరస్థుడి విలువ, హోదా సమాజంలో 50పైసలు మాత్రమే అని ప్రజలకు ఒక స్పష్టమైన, సానుకూల సందేశం ఇవ్వడానికే ఈ ప్రకటన చేశాం’ అని SPతెలిపారు.