వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి ఏపీ స్పీకర్ నోటీసులు పంపించారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎదుట హాజరు కావాలని రెబల్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు లేఖ రాశారు. అంతకు ముందు ఈ నెల 12వ తేదీన రావాలని కోరారు. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేక పోతున్నామని స్పీకర్‌కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ పంపించారు. దాంతో ఈ రోజు(మంగళవారం) మళ్లీ రెబల్ ఎమ్మెల్యేలకు 15వ తేదీన స్పీకర్ వద్దకు రావాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.