గుంటూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ఆరేళ్ల బాలుడిని హత్య చేశారు. ఈ సంఘటన జిల్లాలోని తాడికొండ మండలం బండారుపల్లి గ్రామంలో జరిగింది. హైదరాబాద్ లాలాగూడకు చెందిన స్వప్న, కర్నూల్ జిల్లా ఆలూరుకు చెందిన కొణతాల సిద్దార్థ మధ్య గత కొన్నేళ్లుగా అక్రమ సంబంధం నడుస్తోంది. అయితే వీరికి ఆరేళ్ల బాలుడు అడ్డొస్తున్నాడని హత్య చేశారు. వీరు కొన్నిరోజులు హైదరాబాద్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చి గుంటూరు జిల్లాలోని బండారుపల్లిలో సిద్దార్థ, స్వప్న నివసిస్తున్నారు. బాలుడిని కొట్టి చంపి, మృతదేహాన్ని నిందితులు కాల్చివేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ కేసును పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.