మున్సిపల్ కార్మికుల సమ్మె సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీ ము న్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు కె.విఘ్నేశ్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద రెండో రోజు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొన్ని సమస్యల పరిష్కారానికి అంగీకరించడంతో సమ్మె తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకూ పట్టించుకోలేదన్నారు. జీవోలు జారీ చేయకుంటే మళ్లీ సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ మేనేజర్ కె.వెంకటరమణకు వినతిపత్రం సమర్పించారు జేవీ.రమణరాజు, కొత్తూరి నాగేశ్వరావు, బొక్కా శ్రీనివాస్, రేలంగి నాగరాజు, సోమయదుల వీరప్రసాద్, యడ్లపల్లి ప్రసాద్, అల్లే శ్రీను, రేలంగి ప్రవీణ్, దోసూరి చంద్ర య్య, దూలపల్లి రాంబాబు, కంతేటి వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.