తెలుగుదేశం పార్టీతోనే బీసీలు అభ్యున్నతి సాధించారని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బీసీ సంక్షేమానికి ప్రత్యేక కృషి చేసిందని ఆ పార్టీ భట్రాజు సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ప్రసన్నాంజనేయరాజు పేర్కొన్నారు. భట్రాజుల సాధికార సమితి జిల్లా కన్వీనర్‌గా నాగేంద్ర ప్రసాద్‌ను ఎంపిక చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆది నుంచి తెలుగుదేశం బీసీలకు అండగా ఉందన్నారు. అంతకు ముందు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్‌ను కలిశారు. కార్యక్రమంలో మధుమోహనరాజు, దివాకర్, రామాంజినేయులు, రామచంద్ర, చంద్రశేఖర్‌రాజు, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ సత్యనారాయణరాజు పాల్గొన్నారు.