పశువుల కాపర్లగా, తప్పెటగుళ్లు కళాకారులుగా జీవనోపాధి పొందుతున్న యాదవులకు 50 ఏళ్లకే పెన్షన్ సౌకర్యం కల్పించాలని యాదవ సంఘం శ్రీకాకుళం జిల్లా కోకన్వీనర్ నాగళ్ల మురళీధర్ కోరారు. ఈమేరకు రాష్ట్రంలో యాదవులు ఎదుర్కొం టున్న సమస్యలపై దృష్టిసారించాలని ఆమదాలవలసలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు వినతిపత్రం అంద జేశారు.ఈసందర్భంగా మంగళవారం మురళీధర్ విలేకరులతో మాట్లాడుతూ బీసీ-డిగా ఉన్న యాదవులను బీసీఏలోకి మార్చాలని కోరారు. అటవీజంతువుల దాడులతో పాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రమాదాలు ఎదుర్కొంటున్న యాదవ కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అం దించి ఆదుకోవాలని కోరారు.