ఆందోళన చేపట్టిన అన్నదాతలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా పేర్కొన్నారు. చర్చలకు అనువైన వాతావరణం కల్పించాలని, సాధారణ జనజీవనానికి అవాంతరాలు కల్పించరాదని రైతులకు విజ్ఞప్తి చేశారు.
సాధారణ జనజీవనం భగ్నం కాకుండా చూడాలని తాను రైతు సంఘాలను కోరుతున్నానన్నారు. రైతు సంఘాలతో సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతాయని తానిప్పటికే స్పష్టం చేశానని మంత్రి పేర్కొన్నారు.