కోల్ ఇండియాలో ఈనెల 16న ఒకరోజు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ సమ్మెలో హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, ఐఎన్ఎంఎఫ్, సీఐటీయూ యూనియన్లు పాల్గొంటున్నాయి.
దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటా కలిగిన కోల్ ఇండియా సిబ్బంది సమ్మె బాట పడుతుండటంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, సమ్మెకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.