అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో అరుదైన వ్యాధి కేసు నమోదు అయ్యింది. ఓ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు సోకినట్లు గుర్తించారు. పెంపుడు పిల్లి నుంచి ఆ వ్యాధి వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు.
అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నామని అధికారులు చెప్పారు. బాధితుడి సమీపంలో ఉన్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. అతడి పెంపుడు పిల్లికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు డాక్టర్ రిచర్డ్ వాసెట్ తెలిపారు.