వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని రేపు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు
వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డు కింద రూ.30 వేలు అందిస్తారు. మండలానికి ఐదుగురు/మున్సిపాలిటీలో 10 మంది వాలంటీర్లకు సేవారత్న కింద రూ.20 వేలు, ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పని చేసిన మిగతా వాలంటీర్లకు సేవా మిత్ర కింద రూ.10 వేలు ఇస్తారు.