దక్షిణ మధ్యరైల్వే విజయవాడ డివిజన్లో భద్రతా పర మైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎకె త్రిపాఠి బుదవారం తెలిపారు.
ఈ నెల 26 నుంచి మార్చి 31వ తేదీ వరకు మచిలీపట్నం- విశాఖ, గుంటూరు-విశాఖ, సింహాద్రి, కాకినాడ-విశాఖ, విశాఖ-కాకినాడ, రైళ్లుఈనెల 27 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు విశాఖ-మచిలీపట్నం, విశాఖ- గుంటూరు, సింహాద్రి, రాయగడ- గుంటూరు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు.