వైసీపీ ముఖ్యనేతలు టీడీపీకి టచ్లోకి వస్తున్నారని.. అలాగని ఆ పార్టీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేమని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు.
ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యి మాట్లాడారు. పొత్తులు, చేరికలతో పార్టీలో కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను నిలపట్లేదని పేర్కొన్నారు.