దుబాయిలో భారతీయ ఎంఎస్ఎంఈలు వాణిజ్యం చేయడానికి వీలుగా ఏర్పాటు చేసిన భారత్ మార్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అసలు ఈ భారత్ మార్ట్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
ఇది గోదాము, రిటైల్, ఆతిథ్య సౌకర్యాలను నిర్వహించే బహుముఖ బహుళార్థ సాధక సదుపాయంగా పనిచేస్తుంది. భారీ యంత్రాల నుంచి గృహావసర వస్తువుల వరకు వివిధ రకాల వస్తువులను భారత్ మార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.