ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆనాడు వృద్ధులు పడుతున్న అనేక కష్టాలు గమనించిన సంజీవయ్య రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వృద్ధాప్య పెన్షన్ తో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంజీవయ్య శ్రీకారం చుట్టారన్నారు.