ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఈ రైళ్లు రద్దు, రీ షెడ్యూల్ చేశారు.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2024, 07:38 PM

ఏపీ రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈనెల 26 నుంచి మార్చి 31వ తేదీ వరకు గుంటూరు-విశాఖ(17239) సింహాద్రి, కాకినాడ-విశాఖ(17267), విశాఖ-కాకినాడ(17268), మచిలీపట్నం-విశాఖ(17219), గుంటూరు-రాయగడ(17243) రైళ్లు రద్దు చేశారు. ఈనెల 27 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు విశాఖ-మచిలీపట్నం(17220), విశాఖ-గుంటూరు (17240) సింహాద్రి, రాయగడ-గుంటూరు (17244) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు.


లింక్‌ రేక్‌ ఆలస్యం కావడంతో మంగళవారం (ఈనెల 13న) అగర్తలా-బెంగళూరు(12504) రైలును రీ షెడ్యూల్‌ చేసినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు ఉదయం 5.30 గంటలకు బదులు మూడు గంటలు ఆలస్యంగా 8.30 గంటలకు బయలుదేరేలా మార్పు చేశారని పేర్కొన్నారు. మరికొన్ని రైళ్లను విజయవాడ, ఏలూరు, నిడదవోలు మీదుగా బదులు.. విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. రైలు నంబర్ 22643 ఎర్నాకుళం- పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎర్నాకుళం నుంచి ఈ నెల 26న.. మార్చి, 4,11, 18, 25న దారి మళ్లించారు. రైలు నంబర్ 12509 ఎస్‌వీఎం బెంగళూరు-గౌహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బెంగళూరు నుంచి మార్చి 28, మార్చి 1,6,8,13,15,20,23, 27, 29న దారి మళ్లించారు.


రైలు నంబర్ 11019 సీఎస్టీ ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ముంబై నుంచి బయల్దేరి ఫిబ్రవరి 26,28, మార్చి 1,2,4,6,8,9,11,13,15,16,18,20,22,23,25,27,29,30 దారి మళ్లించారు. ఏలూరు, తాడేపల్లి గూడెంలో ఈ రైలు ఆగదు. అలాగే మరికొన్ని రైళ్లను నిడదవోలు, ఏలూరు, విజయవాడకు బదులుగా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా


దారి మళ్లించారు. రైలు నంబర్ 1335 ధన్‌బాద్-అలెప్పీ బొకోరో ఎక్స్‌ప్రెస్ ధన్‌బాద్ నుంచి బయల్దేరుతుంది.. ఈ రైలును ఫిబ్రవరి 26, మార్చి 31న మళ్లించిన రూట్‌లో వెళుతుంది. తాడేపల్లిగూడెం, ఏలూరులో ఆగదు. రైలు నంబర్ 18111 టాటా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌‌ప్రెస్ టాటా నుంచి బయల్దేరి ఫిబ్రవరి 29, మార్చి 7, 14, 21, 28 దారి మళ్లించారు.. ఏలూరులో ఆగదు. రైలు నంబర్ 12376 జసిదిహ్-తాంబరం ఎక్స్‌ప్రెస్ జసిదిహ్‌ నుంచి బయల్దేరుతుండగా.. ఫిబ్రవరి 28, మార్చి 6,13, 20, 27న దారి మళ్లించారు.. ఏలూరులో ఆగదు.


రైలు నంబర్ 22837 హతియా-ఎర్నాకులం ఏసీ ఎక్స్‌ప్రెస్ హతియా నుంచి ఫిబ్రవరి 26, మార్చి 4, 11, 18, 25 నుంచి బయల్దేరుతుంది.. ఈ రైలును కూడా దారి మళ్లించారు.. ఏలూరులో ఆగదు. రైలు నంబర్ 18637 హతియా-ఎస్‌ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హతియా నుంచి బయల్దేరుతుంది.. ఈ రైలును మార్చి 2, 9,16, 23, 30 తేదీల్లో దారి మళ్లించారు. అలాగే రైలు నంబర్ 12835 హతియా-ఎస్‌ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హతియా నుంచి బయల్దేరే ఫిబ్రవరి 27, 3,5,10,12, 17, 19, 24, 31 తేదీల్లో దారి మళ్లించారు. రైలు నంబర్ 12899 టాటా నగర్-ఎస్‌ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ టాటా నగర్ నుంచి బయల్దేరే రైలు మార్చి 1, 8, 15, 22, 29న దారి మళ్లించారు. ప్రయాణికులు ఈ మార్పుల్ని గమనించి జర్నీ ప్లాన్ చేసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com