పార్టీ పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ ప్రియాంకగాంధీ మాత్రం ఇప్పటివరకు ఎన్నికల బరిలో నిలవలేదు. ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై ఎప్పటికప్పుడు ప్రచారం జరిగినా.. అవేవీ కార్యరూపం దాల్చలేదు.
ఇప్పుడు సోనియా గాంధీ రాజ్యసభకు వెళుతున్న వేళ.. ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. రాయ్‌బరేలీ నుంచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వెలువడుతున్నాయి.