శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) పార్టీని ఏ రాజకీయ పార్టీలో విలీనం చేసే ఆలోచన లేదని ఎంపీ సుప్రియా సూలే స్పష్టం చేశారు. మహా వికాస్ అఘాడి(MVA)
కూటమిలో భాగంగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. తమ వర్గం ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాబోదంటూ పార్టీపై వస్తున్న పుకార్లను సుప్రియా కొట్టిపారేశారు.