సీఎం జగన్ ఎన్నికల వరాల ప్రకటనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నికల హామీలపై తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 18న వైసీపీ మేనిఫెస్టో ప్రకటించనున్నట్లు సమాచారం.
అందులో రైతు రుణమాఫీ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా పెన్షన్ను రూ. 4 వేలకు పెంచనున్నట్లు సమాచారం. వీటితో పాటు మధ్యతరగతి మహిళల ఆర్థిక వృద్ధికి సహాయపడే పథకాలు మేనిఫెస్టోలో ఉన్నట్లు తెలుస్తోంది.