ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న కందుల నారాయణరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2024, 01:13 PM

 రాష్ట్రంలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతిక్లస్టర్‌, బూత్‌ ఇన్‌చార్జులు వెంటనే బూత్‌లలో పను లు ప్రారంభించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమకు కేటా యించిన పనిని వేగంగా పూర్తి చేయాలన్నారు. కార్య క్రమంలో టీడీపీ నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ, వక్కలగడ్డ మల్లికార్జునరావు, కందుల రామిరెడ్డి, కొప్పుల శ్రీనివాసులు, రమణ, నాలి కొండయ్య పాల్గొన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఆదరించి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి కందుల వసంత లక్ష్మీ అన్నారు. పట్టణంలోని రెండవ వార్డులో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ హాయంలో అమలుచేయనున్న సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com