హుండీ దొంగతనం కేసులో నిందితునికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించిన ఘటన విజయనగరం జిల్లా, మక్కువ మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ నరసింహమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2019 సంవత్సరంలో స్థానిక భ్రమరాంబ సహిత మల్లిఖార్జున స్వామి ఆలయం, ములక్కాయవలస గ్రామం కాశీ విశ్వేశ్వర ఆలయాల్లో హుండీల దొంగతనం జరిగింది. ఈ చోరీకి పాల్పడిన మక్కువకి చెందిన చిన్నగొడబ జగదీష్‌పై నేరారోపణ రుజువు కావ డంతో సాలూరు మేజిస్ట్రేట్ కె.రమేష్ 8 నెలల జైలు శిక్షతో పాటు 500 రూపాయలు జరిమానా విధించారు.