రాష్ట్రంలో వైసీపీ ఆటలు ఆడేందుకు ఇంకా 58 రోజులే మిగిలి ఉన్నాయని టీడీపీ రాష్ట్ర అధ్య క్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి మండలం చిన్నసాన ఎంపీటీసీ సభ్యుడు రాజశేఖర్, మాజీ సర్పంచ్ నాగేశ్వరరావుతో పాటు 150 కుటుంబాలు వైసీపీని వీడి బుధవారం టీడీపీలో చేరారు. వీరికి అచ్చెన్నాయుడు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు, ప్రతీ ఎకరాకు సాగునీరందేందుకు టీడీపీ ప్రణాళిక వేస్తోందన్నారు. వైసీపీ పాలనకు అంతిమ ఘడియలు ప్రారం భమయ్యాయన్నారు. సీఎం జగన్ పచ్చి మోసగాడని, ఉత్త రాంధ్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఈ ప్రాంతంలోని సహజ సంపదను కొల్లగొట్టేశాడని విమర్శించారు. ఐదేళ్ల జగన్ పాలన వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగిందని, రాష్ట్రాన్ని అప్పుల మయం చేయడం తప్ప జగన్ రెడ్డి పాలనలో ఎక్కడా సంక్షేమం, అభివృద్ధి లేదన్నారు. సీఎం జగన్ రెడ్డి కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి మళ్లీ అధికారంలో వచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారని దీనిని గమనించాలని సూచించారు. టీడీపీ గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పనిచేసి టెక్కలిని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నారు.