జగన్ పాలన చాలా అధ్వానంగా తయారైందని.. పది సీట్లకే పరిమితం అవుతారని చింతా మోహన్ జోస్యం చెప్పారు. నేడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన చంద్రబాబును చూసి యన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. షర్మిలమ్మ రాకతో కాంగ్రెస్‌లో బాగా బలం పెరిగిందన్నారు. గతంలో పత్రికలలో కాంగ్రెస్ వార్తలు వచ్చేవి కావని.. షర్మిలమ్మ వచ్చాక ప్రతిరోజూ కాంగ్రెస్ పత్రికలలో ఉంటుందన్నారు. జయలలిత లాగా.. ఏపీలో కూడా ఒక మహిళ సీఎం కాకూడదా అని ప్రశ్నించారు. షర్మిలమ్మను సీఎంగా చూడాలనే భావన ప్రజల్లో మొదలైందన్నారు. 130 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ ఘనమైన విజయం సాధించడం నిజమన్నారు. పది స్థానాల్లో జగన్ పరిమితం కాగా, రెండో స్థానంలో చంద్రబాబు ఉంటారన్నారు.