ఏపీ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం కేసీఆర్పై సీపీఐ నేత నారాయణ విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంట్ పునాదులను తవ్వే ప్రమాదముందని ఒకవైపు దేవుళ్ళను పూజిస్తూ.. మరోవైపు రైతులను హింసిస్తోందని ఆరోపించారు. ఈ సందర్బంగా గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రానికి జగన్ బానిస కాబట్టి.. అతని జోలికి ప్రధాని పోలేదన్నారు. కోడికత్తి పేరుతో జగన్ నాటకాలు అడారని, భారత దేశ చరిత్రలో బెయిల్పై సుధీర్ఘకాలంగా బయట ఉన్న వ్యక్తి జగన్ అని అన్నారు. 17ఏ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు కేంద్రానికి దాసోహం అంటున్నారని. జగన్, చంద్రబాబు తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని నారాయణ విమర్శించారు.