వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. జగన్ కేబినెట్ చెత్త కేబినెట్ అని, మంత్రులకు వారి శాఖలే తెలియవని అన్నారు. ‘‘ఢిల్లీ చుట్టూ తిరిగే అప్పుల అప్పారావు ఆర్థిక శాఖ మంత్రి. మైన్స్ మింగేసేవాడు, పాపాల పెద్దిరెడ్డి గనుల శాఖకు మంత్రి. గొనె సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప గాడు సివిల్ సప్లై మంత్రి’’ అంటూ నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ‘‘మా నమ్మకం నువ్వే’’ అంటూ రోడ్ల పై 420 ఫొటోలు పెడుతున్నారన్నారు. సొంత తల్లి, చెల్లె జగన్ను నమ్మడం లేదని.. మరి జనం ఎలా జగన్ను నమ్ముతారని లోకేశ్ ప్రశ్నించారు. సొంత అమ్మా, చెల్లికి న్యాయం చేయలేనోడు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నిలదీశారు. సొంత చెల్లిపై పేటీఎం కుక్కలను వదులుతున్నారంటూ లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.