రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo.. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ పేర్కొన్నారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఎన్సీటీఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని పిటిషనర్ పేర్కొన్నారు. తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన బొల్లా సురేష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ హైకోర్టు రిజిస్టార్‌ని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోరనున్నారు. ఈ పిటిషన్‌పై రేపు వాదనలు జరిగే అవకాశం ఉంది. కేవలం రోజుల వ్యవధిలో పరీక్షలకు సన్నద్ధం కావాలంటూ రాజకీయ ప్రయోజనాలతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారని పిటిషనర్ పేర్కొన్నారు.