క్యాన్సర్‌కు రష్యా శాస్త్రవేత్తలు టీకా తయారుచేస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. త్వరలోనే దాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.
భవిష్యత్తు సాంకేతికతలపై మాస్కోలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. క్యాన్సర్ వ్యాక్సిన్‌తోపాటు రోగనిరోధక శక్తిని పెంచే కొత్త మందు తయారీకి అతి చేరువలో ఉన్నామని వ్యాఖ్యానించారు. తమ టీకా ఏ రకమైన క్యాన్సర్లను నయం చేస్తుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.