కాకినాడ(D) అన్నవరం రైల్వేస్టేషన్ 'ఎఫ్ఎస్ఎస్ఏఐ' నుంచి అరుదైన ఈట్ రైట్ స్టేషన్ అవార్డును సొంతం చేసుకుంది. విజయవాడ డివిజన్లో ఈ హోదా పొందిన తొలి రైల్వే స్టేషన్ గా గుర్తింపు దక్కింది.
కాగా.. జోన్లో నాంపల్లి తర్వాత 2వ స్థానంలో నిలిచింది. స్టేషన్ లోని అన్ని క్యాటరింగ్ స్టాల్స్ ఆహార భద్రత, పరిశుభ్రత, విక్రేత వ్యక్తిగత శుభ్రత, ఫుడ్ గడువు తేదీలు, వ్యర్థాల తొలగింపు వంటివి పరిగణనలోకి తీసుకుని అవార్డును అందించారు.