సిరిగల్లా భారతదేశాన్ని తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోమని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాయచోటిలో వామపక్ష పార్టీలు కార్మిక సంఘాల రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్మికులు దశాబ్దాల కాలంగా చేమటోడ్చి రక్తం చిందించి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటే బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు.