ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి కోల్పోయారని జనసేన పీలేరు నియోజకవర్గం బాధ్యులు బెజవాడ దినేష్ తెలిపారు. గురువారం ఆయన పీలేరు నియోజకవర్గంలోని కెవి పల్లి మండలంలో పర్యటించారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక హామీలిచ్చారని, వాటిలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఒకటని, అది అమలు చేశాకే ప్రజలను ఓట్లు అడుగుతానన్న ముఖ్యమంత్రి కనీసం ఇకనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.