ఏలూరు జిల్లా, తణుకు నరేంద్ర సెంటర్లో వైసీపీ, టీడీపీల మధ్య ఫ్లెక్సీల వివాదం ముదిరింది. నిన్న రాత్రి టీడీపీ ఫ్లెక్సీని తొలగించేందుకు మునిసిపల్ అధికారులు యత్నించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఇతర నాయకులు దీనిని అడ్డుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం వరకూ టీడీపీ ఫ్లెక్సీ తొలగించబోమని హామీ ఇవ్వడంతో టీడీపీ నేతలు వెనుదిరిగారు. తెల్లవారుజామున టీడీపీ ఫ్లెక్సీని అధికారులు తొలగించారు. మున్సిపల్ అధికారులను ప్రశ్నించిన ఆరిమిల్లికి సరైన స్పందన కరువైంది. దీంతో అరిమిల్లితో పాటు టీడీపీ నాయకులంతా మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు.