మనసున్న ప్రతి ఒక్కరూ రాజధాని ఫైల్స్ సినిమా చూడాలని నర్సాపూరం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఈ చిత్రం నిర్మాతకు, డైరెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. అమరావతి రైతుల గొంతును సీఎం జగన్ ఏ రకంగా అన్యాయం చేశారో సినిమాల్లో చూపించారన్నారు. సినిమాలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని, ఎన్నికల ముందు తమకు ఇబ్బందని వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారన్నారు. హైకోర్టు ఆర్డర్ రాకముందే పోలీసులు నిన్న(గురువారం) ధియేటర్‌కు వెళ్లారన్నారు. ఈ సినిమా ద్వారా జగన్ భయపడ్డారని ఎద్దేవా చేశారు. ఈ చిత్రంలో తాను కూడా యాక్టింగ్ చేయాల్సి ఉండే కొన్ని కారణాలతో చేయలేకపోయానని తెలిపారు. రాజధాని ఫైల్స్ సినిమా చూసిన వారికి ఎన్నికల ముందు జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయన్నారు. వైసీపీ నేతలు శపథం వ్యూహం అంటారని సవాల్ చేస్తారని.. వేరే వాళ్లు సినిమా తీస్తే మాత్రం ఒప్పుకోరన్నారు. యాత్ర 2 సినిమాకు జనాలు లేరని.. ప్రైవసీ కొరకు కొన్ని జంటలు వెళ్తున్నాయని చెప్పారు. యాత్ర 2 అట్టర్ ప్లాప్ కన్నా పెద్ద ప్లాప్ అని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాజధాని రైతులు భూములు ఇచ్చారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చంద్రముఖి ఇంటింటికీ వస్తుందని మాటలు మాట్లాడుతున్నారని.. ఆయనకన్నా.. చంద్రముఖి అంత బ్యాడ్ ఏమి కాదన్నారు. ‘హూ కిల్ బాబాయ్’ అనే సినిమా కూడా త్వరలో రావొచ్చని ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు.