2024లో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్య ఠాగూర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రెడీగా ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశాఖపట్నం వస్తున్నారని.. ఆయనతో పాటే సిద్దరామయ్య కూడా వస్తారని తెలిపారు. ప్రియాంకా గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారన్నారు. జగన్ ఏపీ ప్రయోజనాలను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. తమ అజెండా చాలా క్లియర్గా ఉందని... రాబోయే ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.