ఆకాశ విమానయాన సంస్థ త్వరలో ఇంటర్నేషనల్ సర్వీసులను ప్రారంభించనుంది. మార్చి 28 నుంచి దోహాకు విమాన సర్వీసులను ప్రారంభించడం ద్వారా తొలిసారి ఇంటర్నేషనల్ సేవలకు శ్రీకారం చుట్టనుంది.
ముంబై-దోహా మధ్య ఈ నాన్‌స్టాప్ విమానం నడపనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. వారానికి 4 రోజులు సేవలందించనుంది. దీంతో ఖతర్, భారత్ మధ్య రాకపోకలు మెరుగవుతాయని తెలిపింది.