రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోస్తా జిల్లాల్లో ఈ సారి వైసీపీ అన్ని స్థానాల్లో గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో గెలిచిందని, ఈ సారి అంతకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికలు దగ్గరపడటంతో టీడీపీ ఓట్ల రాజకీయం చేస్తోందని ఆయన ఆరోపించారు.