ఢిల్లీ ప్రాంతంలోని పటేల్ నగర్-దయాబస్తీ సెక్షన్‌లో శనివారం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలుకు చెందిన ఎనిమిది వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు ఉత్తర రైల్వే అధికారులు వెల్లడించారు.
జకీరా ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు రైల్వే డీసీపీ KPS మల్హోత్రా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa