వేపాడ మండలం నీలకంఠ రాజపురం గ్రామ సర్పంచ్ గొటివాడ దేవి శనివారం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. సోంపురం సమీపంలో జరిగిన శంఖారావం బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి ఆధ్వర్యంలో జాతీయ టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆమెకు టిడిపి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈమెతో పాటు గ్రామ వైస్ సర్పంచ్ వేచలపు నాయుడు బాబు, పలువురు వార్డు మెంబర్లు, వైసీపీ కార్యకర్తలు టిడిపిలోకి చేరారు.