మొదటి భర్తను వదిలేసి ప్రియుడి కోసం తన పిల్లలతో సహా ఇండియా వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సీమ మొదటి భర్త గులాం తన పిల్లలను పాకిస్తాన్ కు తీసుకువెళ్లేందుకు న్యాయ పోరాటం కోసం భారత న్యాయవాదిని నియమించుకున్నాడు.
తన భార్య నుండి తానేమీ కోరడం లేదని, తన పిల్లలను తనకు అప్పగిస్తే చాలని సీమా భర్త గులాం హైదర్ తెలిపారు. ప్రస్తుతం సీమా హైదర్, ప్రియుడు సచిన్ మీనాల కేసు ఉత్తరప్రదేశ్ పోలీసుల ఏటిఎస్ దర్యాప్తు చేస్తోంది.