జగన్ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మద్యం నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్.. మద్యాన్ని ఎందుకు నిషేధించలేదని ఆయన ప్రశ్నించారు.
శనివారం శృంగవరపుకోటలో నిర్వహించిన టీడీపీ ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కన్నీరు కన్నీరు నుంచి బాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందని, దాన్ని చూసి జగన్ భయపడుతున్నాడని అన్నారు. జగన్కు బీసీలంటే చిన్నచూపని అన్నారు.