ఆంధ్రజ్యోతి జిల్లా స్టాఫ్ ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు సోమవారం తీవ్రంగా ఖండించారు.సిద్ధం సభ కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ జిల్లా ఫోటోగ్రాఫర్ పై రెచ్చిపోయిన వైసీపీ అల్లరి మూకలు దాడి చేశారని, దాడిలో కృష్ణ తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.