పాక్ రాష్ట్రపతి ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థిగా ఆసిఫ్ అలీ జర్దారీని నిర్ణయించినట్లు పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ ఆదివారం తెలిపారు.
"దేశంలో వ్యాపిస్తున్న అల్లర్లను అదుపు చేసేందుకు, రాష్ట్రపతి ఎన్నికలకు మా అభ్యర్థిగా జర్దారీని నిర్ణయించాము" అని బిలావల్ పేర్కొన్నారు. తన తండ్రి జర్దారీ పదవి చేపట్టగానే అల్లర్లు ఆగిపోతాయన్నారు. తట్టా ప్రాంతంలో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.