అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి స్టాప్ ఫోటోగ్రాఫర్ కృష్ణ పై వైసీపీ శ్రేణులు చేపట్టిన దాడిని నిరసిస్తూ సోమవారం పెనుకొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ ఎదుట జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంకు తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, బిజెపి నాయకులు మద్దతు తెలిపారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.