ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 10:25 AM

రానున్న ఎన్నికల్లో ఫ్యాన్‌ రెక్కలు విరిచి మడతపెట్టి బంగాళా ఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో స భ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు అన్నారు. ఎచ్చెర్లలోని నియో జకవర్గ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్కచాన్సు అంటూ సీఎం జగన్‌రెడ్డి రాష్ట్రంలో విధ్వంస పాలన సాగించారన్నారు. ఎవరిది స్వర్ణయుగ మో, ఎవరిది రాతియుగమో ప్రజలకు తెలుసన్నారు. రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో ప్రయాణికులను ఇబ్బందిపెట్టి ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని బలవంతంగా రాప్తాడు సభకు లాక్కెళ్లారన్నారు. ఓటమి భయంతోనే జగన్‌, 77 మంది శాసనసభ్యులను మడతపెట్టాడని, మిగిలిన వాళ్లను 50 రోజుల్లో జనం మడతపెడతారన్నారు. వందల కోట్లు ఖర్చు చేస్తూ.. అధికార దుర్విని యోగంతో సిద్ధం అంటూ సభలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com