అనంతపురం అర్బన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఓ ఫంక్షన హాల్లో క్లస్టర్, యూనిట్ ఇనచార్జిలతో సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి, వైసీపీ పాలనలో అరాచకాలను ప్రజలకు వివరించాలన్నారు. చంద్రబాబును మళ్లీ సీఎంగా చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. కొత్తగా పార్టీలోకి ఎవరైనా వస్తే ఆహ్వానిద్దామని, అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచించారు.