విజయనగరం జిల్లా, చీపురుపల్లి ప్రాజెక్ట్పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సీడీపీఓ కేవీఎన్ రాజరాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. మెరకముడిదాం మండలంలోని పులిగుమ్మి, చినమంత్రిపేట గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, బోడందొరవలస, చీపురుపల్లి మండలంలోని మోదుగులపేట, రిక్షా కాలనీల్లో సహాయకుల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు అర్హతల ధ్రువపత్రాలతో ఈ నెల 24లోగా తమ కార్యాల యానికి దరఖాస్తులు అందజేయాలని ఆమె తెలిపారు.