సీఎం వైయస్ జగన్కు సవాలు విసిరే అర్హత చంద్రబాబు లేదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. గోబెల్స్ ప్రచారం చేసి చర్చకు రమ్మంటే రావాలా అని నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి రారు కాబట్టి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారని ఎద్దేవా చేశారు. సంక్షేమం చేశామని చెప్పి వైయస్ఆర్సీపీ ప్రజల వద్దకు వెళ్తుందని చెప్పారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా ఏం చెప్పిందని, నోటికి వచ్చినట్లు తిట్టడం తప్ప ప్రతిపక్షం చేసింది ఏమీ లేదన్నారు. ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతాని ప్రశ్నించారు. తాము నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుతున్నామని సజ్జల తెలిపారు. సీఎం వైయస్ జగన్ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. తన పాలనలో ఇది చేశాం అని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు? అని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశామని సజ్జల చెప్పారు.