టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో మూడు నామాల బ్రోకర్ కరుణాకర్ రెడ్ది, చిన్న బ్రోకర్ అభినయ రెడ్ది ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనం వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. గత తన మీడియా సమావేశం తరువాత కరుణాకర్, ఆయన కొడుకు బయటకు రాలేదన్నారు. 373 టీడీఆర్ బ్రాండ్స్‌లో సగానికి సగం అవినీతి జరిగిందన్నారు. 18 మాస్టర్ ప్లాన్ల రోడ్లలో కాసుల వర్షం కురిసిందన్నారు. 60 ఎకరాలని, ఒక్కో ఎకరా రూ.59.81కోట్లకి తీసుకున్నారని ఆనం పేర్కొన్నారు. భూమికి సంబంధం లేని వారికి బాండ్స్ ఇచ్చారని.. జాయింట్ కలెక్టర్ స్వయాన స్పష్టం చేశారని గుర్తు చేశారు. తిరుపతిలో డబ్బులిస్తే ఏదైనా చేసేస్తారన్న అనుమానం కలుగుతోందని ఆనం అన్నారు.