ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ జనసేన పార్టీకి ఖరారైంది.
రాజమండ్రి రూరల్ నుంచి జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ బరిలో దిగుతారని జనసేనాని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆశావహులు, ముఖ్యనేతలతో సమావేశమైన అనంతరం పవన్ ఈ మేరకు తెలిపారు.