ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల DSC నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని
ఏపీ హైకోర్టు మంగళవారం తప్పుపట్టింది. సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా నిర్ణయం ఉందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఒక దశలో నోటిఫికేషన్ ఆధారంగా ముందుకెళ్లొద్దని హైకోర్టు సూచించింది. విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది