చెన్నైకి చెందిన ఓ వాహనదారుడికి ఎదురైన విచిత్ర ఘటనను ట్విట్టర్లో షేర్ చేయగా నెట్టింట వైరలవుతోంది. 'గత డిసెంబర్లో వచ్చిన వరదల్లో నా కారు పాడైంది.
దీంతో గిండీ హ్యుండాయ్ షోరూమ్‌కి తీసుకెళ్లాక రిపేర్ ఎస్టిమేట్ చూసి షాక్ అయ్యా.. కారు రూ.7 లక్షలైతే రిపేర్‌కు రూ. 8 లక్షలు వేశారు. వేరే గ్యారేజీలో రిపేర్ చేపిస్తానంటే ఎస్టిమేటేడ్ ఛార్జ్ అని రూ.5900 తీసుకున్నారు. బయట చేపిస్తే రూ.45 వేల ఖర్చు అయింది' అని తెలిపారు.